అంబటి క్షమాపణ చెప్పాలి: ఏలూరి సాంబశివరావు

413చూసినవారు
అంబటి క్షమాపణ చెప్పాలి: ఏలూరి సాంబశివరావు
మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, అంబటి తీరుపై ఘాటు విమర్శలు గుప్పించిన ఏలూరి, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో నోరు పారేసుకున్న కారణంగానే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని, ఘోర పరాజయం ఎదురైనా అంబటికి సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. వైసీపీ బూతుల సంస్కృతిని రాష్ట్ర రాజకీయాల్లోకి తెస్తూ కలుషితం చేస్తోందని ఆరోపించారు. అంబటి వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఏలూరి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్