అమెరికాలో వరద బీభత్సం.. పర్చూరు యువకుడు గల్లంతు

3919చూసినవారు
అమెరికాలో వరద బీభత్సం.. పర్చూరు యువకుడు గల్లంతు
అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో వరదల్లో పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్ గల్లంతయ్యారు. ఒమహా నగరంలో నివసిస్తున్న ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాసి, అమెరికా అధికారులతో సమన్వయం చేసి వెంకటేశ్ ఆచూకీ కోసం గాలింపును వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్