చిన్నారులతో యాచక వృత్తి.. కుటుంబానికి అధికారుల కౌన్సెలింగ్

451చూసినవారు
చిన్నారులతో యాచక వృత్తి.. కుటుంబానికి అధికారుల కౌన్సెలింగ్
ఇంకొల్లు మండలం పూసపాడు అడ్డరోడ్డులో చిన్నారులను వెంటబెట్టుకుని యాచక వృత్తి చేస్తున్న కుటుంబాన్ని అధికారులు గుర్తించారు. మహిళా పోలీస్, అంగన్వాడీ, వైద్య సిబ్బంది విచారణ చేపట్టగా, కుటుంబ పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తేలింది. అతన్ని పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులను యాచక వృత్తిలో ఉపయోగించడం చట్టరీత్యా నేరమని కుటుంబ సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్