బాపట్ల జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు కందిమల్ల రామకోటేశ్వరరావు, గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈనెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిలభారత రైతు మహాసభలను అభ్యుదయ రైతులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలలో దేశంలోని ప్రముఖ రైతు సంఘం నాయకులు పాల్గొని ప్రసంగించనున్నారని, అభ్యుదయ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.