బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

424చూసినవారు
బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం
బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం, నల్లమోతువారిపాలెం గ్రామ సచివాలయం–2 పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్. శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సమయానికి పింఛన్లు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకం అమలులో పారదర్శకత ఉండేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్