పర్చూరు, బాపట్ల ప్రాంతాలకు చెందిన రైతు సంఘం నాయకులు శనివారం పర్చూరు ఎమ్మార్వో బ్రహ్మయ్యకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. పర్చూరు బొమ్మల సెంటర్లో ధర్నా నిర్వహించి, గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని, నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మొక్కజొన్న క్వింటాలకు 2928, శనగకు 7500 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.