పచ్చిమిర్చికి మంచి ధర, రైతుల ఆశలు చిగురిస్తున్నాయా?

708చూసినవారు
ఈ ఏడాది పచ్చిమిరపకాయలకు మంచి ధర పలుకుతోంది. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు, జై, పంగులూరు, మార్టూరు మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు పచ్చికాయ కోతకు వస్తున్నారు. సీజన్లో 10 Island రకాన్ని బట్టి రూ. 400 నుంచి రూ. 500 వరకు రైతుల వద్ద కమిషన్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే, రిటైల్ మార్కెట్లో కేజీ రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నారు. ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం తక్కువగా సాగవ్వడం కూడా ధర పెరగడానికి కారణమని వ్యాపారులు తెలిపారు. కొంత పంటకు నల్లి, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి ఆశాజనకంగా లేదని, పెట్టుబడి మాత్రం రెట్టింపు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్