పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు గ్రామంలో మండల వ్యవసాయాధికారి ఎన్. మేరమ్మ శనగ పంట పొలాలను పరిశీలించి, ఎండు తెగులు నివారణకు రైతులకు సూచనలు చేశారు. చౌడులేని భూముల్లోనే శనగ సాగు చేయాలని, భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన పైరు నుండి విత్తనాలు సేకరించాలని తెలిపారు. తెగులు ఆశించిన పొలాల్లో పంట మార్పిడి చేయాలని, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటివి వేయాలని సూచించారు. ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడి, పశువుల ఎరువు, వేప చెక్క మిశ్రమాన్ని ఎకరాకు వాడాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.