గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం..ఎమ్మెల్యే

509చూసినవారు
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం..ఎమ్మెల్యే
పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావుకు ఆదివారం నల్లమడ వాగు పోరాట సమితి నాయకులు గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే ఏలూరి, రైతు సంఘం నాయకులతో మాట్లాడుతూ గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగింపు ఖచ్చితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శనగల కొనుగోలుకు సంబంధించి వచ్చే ఏడాది కేంద్రాల వద్ద రిస్టోన్ మిషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, మొక్కజొన్న మద్దతు ధర కొనుగోలు విషయం ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్