ఇంకొల్లు మండలం కేశవరపాడు గ్రామంలో శనివారం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో, వేగంగా చేపట్టాలని గుత్తేదారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలలో అభివృద్ధి వేగవంతమైందని ఆయన అన్నారు.