ఇంకొల్లు: బాధితుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

273చూసినవారు
ఇంకొల్లు: బాధితుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే
ఇంకొల్లు గ్రామానికి చెందిన కరణం రోహిత్ కుమార్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర వైద్యం అవసరమైన నేపథ్యంలో, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎల్ఓసి) ద్వారా మంజూరైన రూ. 5,00,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇది తమ బాధ్యత అని తెలిపారు.

సంబంధిత పోస్ట్