పర్చూరు నియోజకవర్గంలోని కోలలపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను బుధవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కత్తిరించి రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.