మార్టూరు మండలం చింతగుంపల గ్రామంలో సుమారు 19 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను సోమవారం పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి రోడ్లను ప్రారంభించిన అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామంలోనూ మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.