అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల్లో పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్ (33) గల్లంతయ్యారు. ఐదేళ్ల క్రితం
అమెరికా వెళ్లి ఓక్లహామా సిటీలో ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ సంబంధిత మంత్రులకు లేఖ రాశారు.