విశ్రాంత ఉద్యోగులకు నకార ఆరాధ్య దైవం: కర్రీ కమలేశ్వరరావు

960చూసినవారు
విశ్రాంత ఉద్యోగులకు నకార ఆరాధ్య దైవం: కర్రీ కమలేశ్వరరావు
ఇంకొల్లు మండల కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు డిఎస్ నకార 113వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కర్రీ కమలేశ్వరరావు మాట్లాడుతూ, పెన్షన్ పొందే విశ్రాంత ఉద్యోగులకు నకార ఆరాధ్య దైవమని, వారి సమస్యల కోసం ఆయన దశాబ్ద కాలం పాటు పోరాడారని తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగి పివి సుబ్బారావు నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనరల్ సెక్రెటరీ టీ వీరాంజనేయులు, తాతయ్య, ఆవుల హనుమంతురావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్