ఇంకొల్లులో పారిశుధ్యంపై సత్యనారాయణ ఆదేశాలు

648చూసినవారు
ఇంకొల్లులో పారిశుధ్యంపై సత్యనారాయణ ఆదేశాలు
ఇంకొల్లు మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలలో స్వా మిత్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై దృష్టి సారించాలని మండల కే సత్యనారాయణ అన్నారు. ఇంకొల్లు మండల అభివృద్ధి కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించాలని, మురుగు కాలువల్లో దోమల నివారణకు ఫినాయిల్, బ్లీచింగ్ చల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో స్వరూప రాణి, సూపర్డెంట్ కిరణ్ కుమార్, 13 పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్