అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో వరదల్లో గల్లంతైన పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్ (32) మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆయన మృతదేహాన్ని కారుకు సమీపంలోని బురదలో గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మూడేళ్ల క్రితం
అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన వెంకటేశ్ ఆకస్మిక మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబమంతా కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.