డేటా ఇంజినీరింగ్‌పై శిక్షణా తరగతులు విజయవంతం

236చూసినవారు
డేటా ఇంజినీరింగ్‌పై శిక్షణా తరగతులు విజయవంతం
వేటపాలెం సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజిలో డేటా ఇంజినీరింగ్‌పై రెండు రోజుల శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. డేటా సైన్స్‌ విభాగంలోని రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. తిరుపతికి చెందిన ఐడి యజన్ టెక్నాలజీ సంస్థ సహకారంతో జరిగిన ఈ శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణ రావు తెలిపారు. ప్రిన్సిపాల్‌ డా కె.జగదీశ్‌ బాబు ఈ వివరాలను వెల్లడించారు.