ఉప్పుటూరు హోమియో ఆసుపత్రికి సౌకర్యాల కరువు

1240చూసినవారు
ఉప్పుటూరు హోమియో ఆసుపత్రికి సౌకర్యాల కరువు
పర్చూరు మండలం ఉప్పుటూరులోని ప్రభుత్వ హోమియో వైద్యశాల కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంచాయతీ కార్యాలయంలోని చిన్న గదిలో ఆసుపత్రి నిర్వహణతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునేందుకు కుర్చీలు, ఇతర మౌలిక వసతులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్