గ్రూప్–1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికైన యద్దనపూడి ఎంపీడీఓ జావేద్‌ను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం అభినందించారు. ఎంపీడీఓ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి ఎదగడం యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో ప్రజాసేవలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా యద్దనపూడి మండల అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న జావేద్ డీఎస్పీగా ఎంపికవడం విశేషమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.