దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడును ఈ నెల 18,19, 20 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించాలని తెలుగుదేశం హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22, 23 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహానాడు నిర్వహించాలని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆ పార్టీ నేతలకు సూచనలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ తీర్మానాలను 21వ తేదీలోపు, పార్లమెంట్ నియోజకవర్గ తీర్మానాలను ఈ నెల 24వ తేదీలోపు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.