ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయం: రేణుకా చౌదరి

349చూసినవారు
ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయం: రేణుకా చౌదరి
గురువారం రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ, ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించినా నిరసనలు ఆపలేదని, ఇది అమరావతి రైతుల విజయమని ఆమె అన్నారు. ఏపీ రాజధానిపై 12 ఏళ్లుగా అస్పష్టతతో పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని, దుగరాజపట్నం, కడప స్టీల్‌ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయం చేశారని మండిపడ్డారు. జగన్ మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారని, రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు ఆడుతోందని ఆరోపించారు. లక్షా 47 వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు జరగలేదని, తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా కేంద్రం నెరవేర్చలేదని, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీ కూడా ఇవ్వలేదని, హామీలు అమలు చేయనందుకు రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్ల తర్వాత కూడా ఆస్తుల పంపకం పూర్తి కాలేదని, ఐదు గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగక తప్పదని ఆమె అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్