పెదకూరపాడులో దారుణం.. మహిళ దారుణ హత్య

1398చూసినవారు
పెదకూరపాడులో దారుణం.. మహిళ దారుణ హత్య
పల్నాడు జిల్లా పెదకూరపాడులో బుధవారం పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. ఆధార్ కార్డు కావాలంటూ అవ్వారు బాల గురవయ్య ఇంట్లోకి చొరబడిన దుండగులు, ఆయన తలపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. అడ్డుకున్న భార్య అరుణ(50) గొంతు కోసి పరారయ్యారు. ఈ ఘటనలో అరుణ మృతి చెందగా, గురవయ్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్