స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడికి (CM Chandrabau Naidu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలోని కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఈ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్‌లో చంద్రబాబు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు.