బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ

455చూసినవారు
బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ
కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయి. అమరావతి అభివృద్ధికి సుమారు రూ.1,128.91 కోట్లు ప్రాథమికంగా కేటాయించారు. ఇందులో ఐబీఆర్‌డీ నిధుల ద్వారా అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు రూ.432.09 కోట్లు, పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదలకు రూ.800 కోట్లు, గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి రూ.350 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్