పెదకూరపాడులో స్థానిక ముస్లిం పాలెం సమీపంలోని లో-లెవల్ బ్రిడ్జి వద్ద సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్ (17) అనే యువకుడికి తీవ్ర గాయాలవ్వగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మరో ఇద్దరు మైనర్ యువకులకు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.