అమరావతి మండలం లింగాపురం చెరువు కట్ట సమీపంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఎరుపు రంగు పంజాబీ డ్రెస్, ఆకుపచ్చ రంగు లెగ్గిన్ ధరించిన యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువతి మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.