గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 22 బస్తాల రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్, సివిల్ సప్లై అధికారులు గురువారం పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆటో, డ్రైవర్, డీలర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.