గుంటూరు జిల్లా పొన్నూరులో కళాతపస్వి డాక్టర్ గరికిపాటి రాజారావు 62వ వర్ధంతి సభ సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 'మాభూమి' నాటకం ద్వారా ప్రజలను చైతన్యపరిచిన మహానటుడు, దర్శకుడు రాజారావు సేవలు మరపురానివని తెలిపారు. పేదలకు తన సొంత ఖర్చుతో వైద్యం చేసి సహాయం చేసిన ప్రజా డాక్టరుగా ఆయనను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అనేక కళాకారులు నివాళులు అర్పించారు.