గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయంలో దాతల సహకారంతో నిర్మించిన పి. పి. జి. యల్ షెడ్ నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరై షెడ్‌ను ప్రారంభించారు. ఆయనతో పాటు పెద్ది భాస్కరరావు ధర్మపత్నీ భవానీ దేవి, ఆమె కుమారుడు రేయన్, కుమార్తె రీతన్య కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్, సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.