గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని శుక్రవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్,
జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు కోసం రాజులు ఆలయాలను నిర్మించారని పేర్కొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో
జనసేన నాయకుడు కోట శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.