మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, రేపు ఉదయం 8 గంటలకు తెనాలిలో జరగబోయే "అన్నదాత పోరు" కార్యక్రమానికి పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సోమవారం తెనాలి A 1 ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ శ్రేణులు ఏ మార్గాల నుండి ఎంతమంది తరలివస్తారనే విషయాలపై చర్చించారు.