పొన్నూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో శనివారం, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎరువుల బ్లాక్ మార్కెట్ పై "అన్నదాత పోరు" పోస్టర్ ను నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. అన్నదాతకు బాసటగా ఈనెల 9వ తేదీన తెనాలి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంబటి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.