పొన్నూరు: యూరియా పై రైతులు ఆందోళన చెందవద్దు ఏవో

1150చూసినవారు
పొన్నూరు మండలం వెల్లలూరు, బ్రాహ్మణ కోడూరు గ్రామాలలో గురువారం యూరియా వాడకంపై రైతులతో సమావేశం జరిగింది. మండల రైతులు యూరియా సరఫరా గురించి ఆందోళన చెందవద్దని ఏవో వెంకటేశ్వరరావు సూచించారు. యూరియాను ముందుగానే అంచనా వేసి ఇండెంట్ పెట్టడం జరిగిందని, ఇప్పటివరకు పొన్నూరు మండలానికి 3127 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, మరో 518 మెట్రిక్ టన్నుల యూరియా అంచనాలు పంపామని తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్