పెదకాకాని గ్రామానికి చెందిన మహమ్మద్ రహమద్ ఆలీ ఇటీవల ప్రమాదానికి గురై మంచానికి పరిమితం కావడంతో, ఆదివారం ఆటో యూనియన్ నాయకులు అతన్ని పరామర్శించి రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ, గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, ఇతర ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.