పొన్నూరు: జన సైనికులు సేవా దృక్పథంతో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే

1527చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అమ్మా సేవ నిలయంలో మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అనాధలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని ప్రతి జన సైనికుడు సేవా దృక్పథం కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, వీర మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్