ఆదివారం పెదకాకాని సిఐటియు కార్యాలయంలో జరిగిన మహిళా సంఘం గ్రామ మహాసభలో, జిల్లా అధ్యక్షురాలు కె. పద్మ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కే పద్మ, సిఐటియు సభ్యులు పాల్గొన్నారు. జెట్టి రాజలక్ష్మి అధ్యక్షత వహించారు.