
ప్రతిపాడు: పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్
గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం కోయవారిపాలెం గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రంలో కల్పించాల్సిన సదుపాయాలపై అధికారులకు సూచనలు అందించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే స్పందించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలతో ఆయన మాట్లాడారు.




































