బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు కొల్లూరులోని కాకతీయ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మాజీ ఎంపీపీ కనగాల మధుసూధన ప్రసాద్ ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్స్ – గుంటూరు సౌజన్యంతో ఈ శిబిరం జరిగింది. ప్రజారోగ్య పరిరక్షణలో, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.