అంగన్వాడీ కేంద్రంలో మురిగిన గుడ్లు

852చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో మురిగిన గుడ్లు
కాకుమాను మండలం అప్పాపురం ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో మురిగిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లలకు పౌష్టికాహారంగా పాడైన గుడ్లు ఇవ్వడం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్