పురుగుమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

1226చూసినవారు
పురుగుమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో దొడ్డంపూడి శివశంకర్ రావు అనే కౌలు రైతు అప్పుల బాధ తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత పది సంవత్సరాలుగా కౌలుకు వ్యవసాయం చేస్తున్న ఆయన, గత మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. ఇటీవల తన ఇంటిని 20 లక్షలకు అమ్మి అప్పులు తీర్చినా, ఇంకా అధికంగా అప్పులు ఉండటంతో రుణదాతల ఒత్తిడితో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్