రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ లో "జీవితం అమూల్యమైనది – ఆత్మహత్యల నివారణ" అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ సీడీపీవో సుచిత్ర మాట్లాడుతూ, జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆత్మహత్య పరిష్కారం కాదని తెలిపారు. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు లేదా అధికారులతో మాట్లాడాలని సూచించారు.