భట్టిప్రోలు భారీగా రేషన్ బియ్యం పట్టివేత

1116చూసినవారు
భట్టిప్రోలు భారీగా రేషన్ బియ్యం పట్టివేత
బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం గొరిగపూడిలోని ఓ ప్రైవేటు గోదాంపై బుధవారం రాత్రి విజిలెన్స్, పౌరసరఫరాల అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 450 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన నాగమల్లేశ్వరరావు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు మండల పౌర సరఫరా శాఖ అధికారి ఓంకార్ తెలిపారు. ఈ దాడుల్లో రెవిన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్