ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూరేపల్లి గ్రామ పర్యటన సందర్భంగా, ది 9వ తేదీన ఉదయం 6 గంటల నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు భట్టిప్రోలు గ్రామ శివారున జాతీయ రహదారి -216ఏ వద్ద గల వేమవరం జంక్షన్ నుండి రేపల్లె వైపుకు వెళ్ళే వాహనాలను హైవే మీదుగా రేపల్లెకు మళ్ళించారు. అలాగే, రేపల్లె వైపు నుండి పల్లెకోన మీదుగా కోనేటిపురం వైపుకు వచ్చే వాహనాలను పడమటిపాలెం జంక్షన్ ఆర్చి వద్ద డైవర్షన్ చేసి, జిల్లేపల్లి, పెద్దవరం మీదుగా కనగాల వద్ద జాతీయ రహదారి 216ఏ లోకి మళ్లించినట్లు రేపల్లె డిఎస్పి ఆవుల శ్రీనివాసరావు బుధవారం మీడియాకు తెలిపారు.