నకరికల్లు మండలంలోని త్రిపురాపురం మేజర్ కెనాల్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల నుంచి వేగంగా వచ్చిన కారు, మోటారు రిక్షాను బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 45 ఏళ్ల నారాయణమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.