జైపూర్‌లో జనవరి 18 నుండి 23 వరకు జరిగిన ఇండియా తైక్వాండో థర్డ్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025–2026 పోటీలలో బాపట్ల జిల్లాకు చెందిన పి.ఎస్.ఓ. మల్లెల విజయ్ బాబు కుమార్తె రంజయు లోచన్, కుమారుడు నిక్షిప్త విజయ్ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు బుధవారం వారిని అభినందించారు. ఈ పోటీలు జాతీయ స్థాయిలో ఎస్‌డీఎంఎస్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి.