బుధవారం, రేపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ నగరం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద చెత్త సేకరించే కొత్త వాహనాలను ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రత కోసం ఈ వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ జనసేన పి ఓ సి మత్తి భాస్కర్, ఎంపీడీఓ బొర్రా శ్రీనివాసరావు, బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు గుర్రం మురహరి, విచారపు వీరయ్య, మేకా శివరామకృష్ణ, లుక్కా గుడారంకయ్య, పిన్నిబోయిన చింతారావు, మైల నరేష్ తదితరులు పాల్గొన్నారు.