యు ఈ సి డబ్ల్యూ యు 3వ మహాసభలు జయప్రదం చేయండి

498చూసినవారు
యు ఈ సి డబ్ల్యూ యు 3వ మహాసభలు జయప్రదం చేయండి
ఈనెల 8న కడపలో జరగనున్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (యూఇసిడబ్ల్యుయూ) 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రేపల్లె విద్యుత్ సబ్స్టేషన్ వద్ద యూనియన్ సభ్యులు పోస్టర్ విడుదల చేసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా జరిగే ఈ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. సురేష్, సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి బాబురావు, కోశాధికారి మణిలాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్