ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు కట్టుబడి రేపల్లె నియోజకవర్గంలో అపూర్వమైన సంక్షేమ అభివృద్ధి విప్లవం సృష్టించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శనివారం రేపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన, రూ. 1.845 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. అనంతరం లబ్ధిదారులకు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.