ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితుడై, త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మోపిదేవి శ్రీనివాసరావు ప్రకటించారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మకంగా పనిచేశానని, వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని, ఆయన చేసిన మంచి పనులు ఎన్నదగినవని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి వైఎస్ జగన్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఆయనకు మద్దతు తెలిపారు.